29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

హెచ్ఐవీ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Must read

📰 Generate e-Paper Clip

దోమకొండ, బతుకమ్మ : ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకుని హెచ్ఐవీ రహిత సమాజాన్ని నిర్మించాలని దోమకొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా దోమకొండలో శనివారం వై.ఆర్.జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ…. హెచ్ఐవీ నిర్మూలనలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఐసిటీసీ కౌన్సిలర్ మేక నాగరాజు మాట్లాడుతూ.. ఐసీటీసీ, ఏఆర్టీ సేవల గురించి వివరించారు.

Let's build an HIV-free society

హెచ్ ఐవీ గురించి అందరూ చర్చించి, అవగాహన పెంచుకోవాలన్నారు. లింక్ వర్కర్ స్కీం ద్వారా గ్రామంలో అందిస్తున్న సేవలను లింక్ వర్కర్ బాలకిషన్ వివరించారు. హెచ్ ఐవీ ఎలా వ్యాప్తిస్తుందనే విషయాలను తెలిపారు. హెచ్ ఐవీ కి నివారణ ఒక్కటే మార్గమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు తీగల తిర్మల్ గౌడ్, మాజీ ఎంపిటీసి నల్లపు శ్రీనివాస్, పీజీ హెచ్ ఎం శరత్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ శ్రీ కాంత్, ఐకేపీ ఏపీఎం రాజు, సీసీలు రమేష్, రామక్రిష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి అబ్రబోయిన స్వామి, నాయకులు మధుసూదన్, లింగం, రాములు,అంజయ్య, రాజు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఐకేపీ వీవోఏలు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Let's build an HIV-free society

More articles

Latest article