. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి
. మృతులు హైదరాబాద్ కు చెందిన వారు..
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు వచ్చిన ఇద్దరు చెరువులో మునిగి మృతి చెందారు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ కు చెందిన ఆరుగురు యువకులు మోపాల్ మండలంలోని మంచిప్ప దర్గా కు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అయ్యద్ యాకూబ్(32), సయ్యద్ వాసిక్(32) అనే ఇద్దరు యువకులు సరదాగా అక్కడే ఉన్న పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. నీటిలో దిగిన ఇద్దరు గల్లంతయ్యారు. స్థానికులు గమనించి గాలించగా యాకుబ్ మృతదేహం లభించింది. పోలీసులకు సమాచారం అందించగా, రెస్క్యూ టీము ఘటనాస్థలానికి చేరుకొని గాలించి వాసిక్ మృతదేహాన్ని బయటికి తీశారు. హైదరాబాద్ లోని చంచల్ గూడకు చెందిన వాసిక్ కరాచీ బేకరిలో అకౌంటెంట్ గా పనిచేస్తుండగా, యాకూబ్ ఆటో మొబైల్ దుకాణంలో పని చేస్తున్నాడు.

