25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

గర్భిణీపై పోచారం అనుచరుడి దాడి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: నస్రుల్లాబాద్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఊరిలో నడుపుతున్న హోటల్ ను మూసివేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్యాభర్తలపై ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు, మాజీ ఎంపీటీసీ కంది మల్లేశ్ వారం రో జుల క్రితం దాడి చేశాడు. ఈ ఘటనలో గర్భవతి అయిన రాజేశ్వరి గాయపడింది. తీవ్ర రక్తస్రావంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులకు ఫిర్యాదుచేసి వారం రోజులవుతున్నా పట్టించుకోవడం లేదనే బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లేశ్ తోపాటు మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలిసింది.

 

More articles

Latest article