27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జుక్కల్‌లో యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలించిన కలెక్టర్ 

Must read

📰 Generate e-Paper Clip

 

 

. .  . స్వాగతం పలికిన డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ 

 

జుక్కల్, బతుకమ్మ : 

 

జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్”  పనులను శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్  పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కలెక్టర్ ని ఆత్మీయంగా స్వాగతించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం స్కూల్ నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను కలెక్టర్  సమగ్రంగా పరిశీలించి, పనులను అత్యుత్తమ నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి పట్ల కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్  చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను, విద్యా రంగంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

Collector inspects Diya School works

 

 

More articles

Latest article