29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ : 

 

మద్నూర్ మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  పరీక్ష వ్రాస్తున్న విద్యార్ధుల హాజరు శాతం, సౌకర్యాల పై విద్యా శాఖ అధికారి రాజు ను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను పరిశీలించి విద్యార్ధుల ఆరోగ్య , భద్రత దృష్ట్యా వైద్య సిబ్బంది, అవసరమైన మెడిసన్  అందుబాటులో ఉంచాలని తెలిపారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

District Collector inspects 10th class examination center

More articles

Latest article