24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్సీ వర్గీకరణ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పా

Must read

📰 Generate e-Paper Clip

. . . వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక మాల జాతిలో అభద్రత నెలకొంది

. . . ఎసిబి దాడులు  90 శాతం మాల ఉద్యోగులపై జరుగుతున్నాయి

.. . చెన్నూర్  ఎమ్మెల్యే డాక్టర్ వివేక్

 నిజామాబాద్, బతుకమ్మ :

స్వజాతి ప్రయోజనాల కోసం కంకణం కట్టుకున్న.. మాలల ఎదుగుదలను అణిచివేసే కుట్రలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెన్నూర్  ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ అన్నారు.  నిజామాబాద్ నగరంలో జరిగిన మాలల ఆత్మగౌరవ సభలో ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ సంచల వాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పా అని పేర్కోన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక మాల జాతిలో అభద్రత నెలకొందని  ఇప్పుడు మేల్కోపోతే  మాల జాతి భవిష్యత్తు ఆగాధంలో పడుతుంది.. సొంత పనులు పక్కన పెట్టాల్సిన టైం వచ్చిందని అన్నారు. భయం ముసుకు వీడి ధైర్యం చూపాలే… అన్ని రాజకీయ పార్టీలకు మన సత్తా అర్థమయ్యేలా ఐక్యత చాటాలే అని పిలుపు నిచ్చారు. రాష్ట్ర జనాభాలో మాల కమ్యూనిటీది రెండవ స్థానం 30 లక్షల మంది జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారు.

CM Revanth Reddy's decision on SC classification is not correct

మాల జాతి ఐక్యతను చీల్చడానికి కుట్రలు జరుగుతున్నాయి.. ఐక్యత సాధించడానికి మా నాన్న స్ఫూర్తితో బయటకు వచ్చా అని వివేక్ అన్నారు. ఈడి, ఇన్కమ్ టాక్స్ రైడ్లతో భయపెట్టడానికి ప్రయత్నించారు. ఉద్యమం నుంచి బయటకు వస్తే  కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామన్నా దేనికి లొంగలేదు.. స్వరాష్ట్రాన్ని సాధించా అని గుర్తు చేశారు.  సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు నా ఫ్యాక్టరీ క్లోజ్ చేయించారు నామీద ఎప్పటికీ ఎలాంటి ప్రెజర్స్ పని చేయలేవు.. మా నాన్న కాకా వెంకటస్వామి బోధనలతో పెరిగిన వాడిని.. నష్టాలు, కష్టాలు వచ్చినా పట్టించుకునే వాడిని కాదు ,ఏసీబీ దాడులు 90 శాతం మాల ఉద్యోగులపైనే జరుగుతున్నాయి అని అవేధన వ్యక్తం చేశారు. డిసెంబర్ 1న హైదరాబాద్లో తలపెట్టిన సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహనాడు రాష్ర్ట అధ్యక్షులు చెన్నయ్య, నాయకులు అలుక కిషన్, ఎడ్ల నాగరాజు, అమృత్, విజయ్, , రామచందర్,  అంగరి ప్రదీప్, ఎల్లమయ్య, స్వామి దాస్, చోక్కం దేవిదాస్, మోహన్  రావు, ఎడ్ల సంజీవయ్య, వాగ్మారే సుభాష్, సర్వయ్య, విజయ్ కుమార్, జయపాల్, సుంకరమోహన్ తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Reddy's decision on SC classification is not correct

 

 

More articles

Latest article