ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లో గల భువి వాటర్ ప్లాంట్ ను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంత పెద్ద మొత్తంలో భువి వాటర్ ప్లాంట్ ఇండస్ట్రీ ని స్థాపించిన వ్యవస్థాపకులు మైలారం బాలు ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ మునుభాయ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జు భాయ్, జిమ్మి రవి, రవీందర్ రెడ్డి, రాజు, భుపెందర్,ఫాయీమ్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బుస ముత్యం పాల్గొన్నారు.

