27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

యుఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  • యుఎస్ఎఫ్ఐ యూనిట్ కమిటీ కార్యదర్శి బాబురావు

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :  యుఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని యుఎస్ఎఫ్ఐ యూనిట్ కమిటీ కార్యదర్శి బాబురావు పిలుపు నిచ్చారు. యుఎస్ఎఫ్ఐ హాస్టల్ యూనిట్ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగర కేంద్రంలో గల స్కూల్ హాస్టల్ లో యుఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభల కరపత్రాలను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగాయుఎస్ఎఫ్ఐ యూనిట్ కమిటీ కార్యదర్శి బాబు రావు మాట్లాడుతూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ వ్యవస్థాపక అఖిల భారత మహాసభలు 2024 డిసెంబర్ 14, 15 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం 1984 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ పోరాటల గడ్డమీద ఏర్పడిందని తెలిపారు. అధ్యయనం, ఐక్యత, పోరాటం అనే నినాదంతో ముందు సాగుతూ, దేశంలో అందరికీ సమాన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,ప్రభుత్వ విద్యారంగా అభివృద్ధికై నాటి నుంచి నేటి వరకు కృషి చేస్తుందని అన్నారు. అదే విధంగా కొఠారి కమిషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో 10% నిధులు , రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో 30 % నిధులు కేటాయించాలని ఉన్న ఇప్పటి వరకు కనీసం సగం కూడా కేటాయించాలేని దుస్థితిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు. అలాగే ఒక వైపు ప్రయివేటు,కార్పొరేటు విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ,ఇంకో వైపు ప్రభుత్వ విద్యాసంస్థలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. అదే విధంగా ఈ అఖిల భారత మహాసభల లో ప్రస్తుత విద్యా రంగా పరిస్థితి పై చర్చించి, భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పన చేసుకొని నూతన అఖిల భారత కమిటీని ఎన్నుకోవటం జరుగుతుందని అన్నారు. ఈ మహాసభలను జయప్రదానికి విద్యావేత్తలు,మేధావులు సలహా,సూచనలు, సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ యూనిట్ కమిటీ సభ్యులు పోశెట్టి,హరి ప్రసాద్,వంశి,రోహిత్,సాయిప్రసాద్,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article