. . . బాలసుబ్రమణ్యం విగ్రహం విషయంలో నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటా
. . . హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా,డ్రైనేజీ,మంచినీటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు
. . . బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
సీఎం రేవంత్ రెడ్డి గంట ఎంటర్ టైన్ మెంట్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని, ఆయన ఫుట్ బాల్ ఆడుతానని ప్రచారం చేసుకోవటానికి ఆడినట్లు ఉందని,దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏమీ ప్రయోజనం ఉందో చెప్పాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సీఎం ఫుట్ బాల్ గేమ్ తెలంగాణ ప్రజలకు పనికి రాలేదని,వాళ్లు రీల్స్ చేసుకోవటానికి మాత్రమే పనికి వచ్చిందని విమర్శించారు.ఈ పదికోట్లను కూడా సింగరేణి బిడ్డల నిధి నుంచి ఖర్చు చేశారని,ఇప్పటికే సింగరేణి డబ్బును సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు తీసుకెళ్లారని,కచ్చితంగా సింగరేణి డబ్బును కాంగ్రెస్ తన పార్టీ ఫండ్ నుంచి రిటర్న్ ఇవ్వాలని, సింగరేణి డబ్బు ను అక్కడ ప్రజల కోసమే వాడాల్సి ఉందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం లో ఈ విధంగా ఖర్చు చేసి ఉంటే దానిపై కూడా సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్లకుండా మ్యాచ్ కోసం స్టేడియం కు వెళ్లారని,విద్యార్థులకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ఏదో రాజుల అన్నట్లుగా ఇలా వచ్చి అలా ఆయన ఢిల్లీకి వెళ్లారని అన్నారు. జయ జయహే గీతం పాడనని బాల సుబ్రమణ్యం అన్నట్లు ఆరోపణ ఉందని,అందుకే ఆయన విగ్రహాం విషయంలో నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటానని స్పష్టం చేశారు. రవీంద్రభారతి లో తెలంగాణ జానపద కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. సినీ కళాకారుల విగ్రహాలను నేను వద్దనటం లేదని,కానీ వాటిని కోసం ఇతర ప్రాంతాలను ఎంచుకోవాలని సూచిస్తున్నానన్నారు. హైదరాబాద్ లో డివిజన్లు అశాస్త్రీయంగా జరిగిందని,ఒకే పార్టీ గెలిచే విధంగా వాటిని డివిజన్ చేశారని ప్రజలు చెబుతున్నారన్నారు. అసలు ఏ ప్రతిపాదికన డివిజన్లను డివైడ్ చేశారో చెప్పాల్సిన అవసరముందన్నారు. ఓల్డ్ సిటీలో న్యూ సిటీలో డివిజన్లను అశాస్త్రీయంగా డివైడ్ చేశారని,మల్కాజ్ గిరి లో గతంలో 500 మంది ప్రజా ప్రతినిధులు ఉంటే ఇప్పుడు 40 మందే ఉండే పరిస్థితి తెచ్చారన్నారు. జనం బాటలో భాగంగా హైదరాబాద్ లో ఐదు రోజులు పర్యటించినట్లు తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్ అంటేనే తెలంగాణకు గుండెకాయ అని, హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామంటే మనం ఊరుకోలేదని,పట్టు పట్టి మరీ హైదరాబాద్ తో ఉన్న తెలంగాణను సాధించుకున్నామన్నారు. హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ గా 10 ఏళ్లు అభివృద్ధి జరిగిందని,ఇంకా తెలంగాణలో అభివృద్ది కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఇప్పటికే కోటి మంది నివాసం ఉంటున్న సిటీలో మరో 27 మున్సిపాలిటీలను కలిపారు. కానీ దానికి తగిన విధంగా ప్రజా రవాణా సదుపాయం లేదని, గతంలో 7500 బస్సులుంటే ఇప్పుడు వాటిని 3500 బస్సులకు తగ్గించారన్నారు. సిటీలో ఎక్కడకు వెళ్లిన సరే బస్సుల సమస్య గురించే చెబుతున్నారని,బస్సులు తగ్గించటంతో వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయటంతో కుక్కల సమస్య పెరిగిందన్నారు. కుక్కల కోసం ఉన్న బడ్జెట్ ను సరిగా వినియోగించటం లేదన్నారు. ఇక హైదరాబాద్ క్రైమ్ రేటు పెరిగిందని,క్రైమ్,మర్డర్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. ఇక హైదరాబాద్ లో చాలా చోట్ల డ్రగ్స్ సమస్య పెరిగిపోయిందని, డ్రగ్స్ తీసుకునే ఏరియాలు ఎక్కడున్నాయో తెలిసిన సరే ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నాని ఆరోపించారు. లంగర్ హౌస్ లో బాపు ఘాట్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని అన్నారు. ఇక సిటీలో చాలా చోట్ల మురికి నీళ్లు వస్తున్నాయని, అడిక్ మెట్ లో నీళ్లలో పెట్రోల్ వాసన వస్తోందని, ఇంత మహానగరంలో మంచి నీళ్లు సరిగా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. జూబ్లీహిల్స్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని,అక్కడ నీళ్లు లీక్ అవుతున్న పట్టించుకోవటం లేదన్నారు. ఆడుకోవటానికి పిల్లలకు స్టేడియం ఇవ్వకుండా, పెళ్లిలకు,ఫంక్షన్స్ కు ఇస్తున్నారన్నారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లను ఎక్కువగా కేటాయించాలని, హైదరాబాద్ లాంటి ఫేమస్ నగరంలో మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగ్గా ఉండాలన్నారు.

