. . . నిజామాబాద్ జిల్లాలో 76.71 శాతం పోలింగ్
. . . కామారెడ్డిలో 86.08శాతం ఓట్లు పోల్
నిజామాబాద్/ కామారెడ్డి, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకుప్రారంభమైన పోలింగ్ 9 నుంచి 11 మధ్య ఊపందుకుంది. 11 గంటల వరకు ఉమ్మడి జిల్లా లో సగానికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు కూడాపోలింగ్ కేంద్రాల్లో ఒటర్లు ఉండటంతో 2 గంటల వరకు అవకాశం ఇచ్చారు. దీనితో నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా 76.71 శాతం,కామారెడ్డి 86.08 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసిన చోట మధ్యాహ్నం 2గంటల నుంచి వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. అందులో మెజారిటీ సభ్యుల ఇష్టం ప్రకారంఉప సర్పంచ్ ల ఎన్నిక జరిగింది. సర్పంచ్ పదవికి ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం ప్రారంభమైరాత్రి వరకు సాగింది. నిజామాబాద్ జిల్లా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోభాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో158 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. 158 పంచాయతీలకు 568 మంది సర్పంచ్అభ్యర్థులు, 1081 వార్డు మెంబర్స్ స్థానాలకు 2634 మంది బరిలో నిలిచారు.. మొత్తం2,38,838 మంది ఓటర్లు కి గాను 1,83,219మంది ఓట్లు వేశారు. అందులో 1.06,737 మంది మహిళలు ఉండగా, 76,479 మంది పురుషులుఉన్నారు. ధర్పల్లి మండలం లో 29019 మందిఓటర్లకు 21,049 మంది ఓట్లు వేయగా, డిచ్పల్లిలో 43,382 ఓట్లకు గాను 33,111 ఓటు వేయగా, ఇందల్వాయి 29258 మందికి గాను 22054 , జక్రాన్ పల్లిలో 31266ఓట్లకు గాను 23471, మాక్లూర్ లో 25665 కిగాను 20255, మోపాల్ లో 29062 ఓట్లకు గాను 23031, నిజామాబాద్ రూరల్ లో 19641 ఓట్లకు గాను 15806, సిరికొండ మండలం లో31545 మంది ఓట్లకు గాను 24442 ఓట్లు పోలయ్యాయి. నిజామాబాద్ రూరల్ లో అత్యధికంగా80.47 శాతం, అత్యల్పంగా ధర్పల్లి లో 72.54శాతం ఓట్లు నమోదయ్యాయి.

కామారెడ్డి జిల్లాలో రెండో విడత ఎన్నికలు 153 పంచాయతీలకు,873 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు చెందిన 8మండలాల్లో పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 1,64,301 మంది ఓటర్లకు గాను 1,41,424 మందిఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 67,768 మంది పురుషులు, 73656 మంది మహిళలు ఓట్లు వేశారు. జిల్లాలో 86.08 శాతంఓటింగ్ జరిగింది. ఎల్లారెడ్డి అత్యధికంగా 18,389 మంది ఓటర్లకు గాను 16498 మందిఓట్లు వేయగా , అత్యల్పంగా పిట్లం మండలంలో35,073 మందికిగాను 29502 మంది, గాంధారిమండలం లో 30,886 ఓట్లకు గాను 26322 మందిఓట్లు వేశారు. లింగంపేట్ లో 30489 కి గాను 25,501 ఓట్లు పోల్ అయ్యాయి. మహమ్మద్ నగర్లో 13,607 మందికిగాను 11795 మంది,నాగిరెడ్డి పేట్ 21,994 కు గాను 19506 మంది ఓట్లు వేశారు.
