24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే

 

జుక్కల్, బతుకమ్మ

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ ఫోటోకి పూలమాలలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన దేశసేవలను ఘనంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలేటి మల్లికార్జున్ హాజరయ్యారు. మహారాజ్ ధైర్యసాహసాలు, పరాక్రమం, దేశభక్తి నేటి తరానికి ఆదర్శమని వారు పేర్కొన్నారు. అనంతరం చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మరాఠా సంఘం నాయకులు, మాజీ జడ్పిటిసి సభ్యులు లక్ష్మీబాయి దాదారావు పటేల్, మాజీ జడ్పిటిసి సభ్యులు మాధవ దేశాయ్, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మహారాజ్‌ను స్మరించుకున్నారు.

 

 

Chhatrapati Shivaji Jayanti celebrations in full swing

More articles

Latest article