25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మారింది పాలకులే పాలన కాదు

Must read

📰 Generate e-Paper Clip

  • భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి

ధర్పల్లి, బతుకమ్మ : కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలను ఆరు అబద్ధపు గ్యారెంటీలను 66 మోసాలను సవాల్ చేస్తూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో దినేష్ కులచారి మాట్లాడుతూ అబద్ధపు గ్యారంటీలు,హామీలతో ప్రజల్ని వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని,కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన అంతా వైఫల్యమె అని అన్నారు. రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి,ఇందిరమ్మ ఇండ్లు,వృద్ధులకు,వికలాంగులకు చేయూత,యువకులకు యువ వికాసం పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని అన్నారు.రాష్ట్రంలో మారింది పాలకులే గాని పాలన కాదని అప్పుడు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల దోపిడీ అని ఇప్పుడు మూసి ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీ అని, గత ప్రభుత్వ మాదిరిగానే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తుందని ప్రజాస్వామ్యానికి పాతరేస్తో ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అప్పుడు ధరణితో 10 లక్షల మంది రైతుల భూములు మాయం కాగా ఇప్పుడు హైడ్రా ఫోర్త్ సిటీ పేరుతో లక్ష ఇండ్ల కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మాజీ ఎంపీపీ గద్దె భూమన్న, ధర్పల్లి భాజపా మండలాధ్యక్షులు లోలం గంగారెడ్డి,భాజపా నాయకులు కర్క గంగారెడ్డి,జిర్ర మహిపాల్ యాదవ్,నరేష్, టి.శ్రీనివాస్, పల్లె రాజన్న, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article