26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సైన్స్ ఫేర్ లో కాకతీయ విద్యార్థుల ప్రతిభ

Must read

📰 Generate e-Paper Clip

  •  జిల్లాలో ఫస్ట్ ప్లేస్ 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన  సైన్స్ ఫేర్ లో కాకతీయ  హైస్కూల్ కు చెందిన విద్యార్థులు  జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. కాకతీయ స్కూల్ కు చెందిన (కెవోఎస్) దీక్షిత, గ్రీష్మా అనే విద్యార్థినిలు డయాస్టర్ మేనేజ్ మెంట్ సిస్టం ప్రాజెక్టుపై ప్రదర్శన జిల్లాలో మొదటి స్థానంలో  నిలిచి రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కు ఎంపికైందని పాఠశాల చైర్ పర్సన్ విజయలక్ష్మీ తెలిపారు.

Talent of Kakatiya students in science fair

ధాన్యం ఆరబోసినప్పుడు వర్షం వస్తే సెన్సర్ లో గుర్తించే ఆటోమెటిక్ పైకప్పు వచ్చేలా, వ్యవసాయ క్షేత్రంలోకి పశువులు వస్తే హెచ్చరించేలా, పంటలకు కావాల్సిన తేమ తర్వాత నీటి  పంప్ లు ఆగిపోయేలా రూపొందించిన  ప్రయోగాలతో రైతుల కష్టాలు తొలగించేందుకు సంబంధిత ప్రదర్శన ఉపయోగపడుతుందని దాని ద్వారా విద్యార్థులు సైన్స్ ఫేర్ లో నిరూపించారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి  రాష్ట్ర స్థాయి  సైన్స్ ఫేర్ కు ఎంపికైన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ , డీసీఈడి కార్యదర్శి సీతయ్యలు  ప్రశంసా  పత్రాలను అందజేశారు.

Talent of Kakatiya students in science fair

More articles

Latest article