27.3 C
Hyderabad
Friday, July 31, 2026

జుక్కల్‌లో సెంట్రల్ లైన్ పనులు వేగవంతం

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ పట్టణంలో సెంట్రల్ లైన్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వం ఈ పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ అమలు చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక చొరవతో సెంట్రల్ లైన్ పనులు వేగవంతమయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో రహదారులు, మౌలిక సదుపాయాలు, పాత బస్టాండ్ అభివృద్ధి వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే జుక్కల్‌కు మున్సిపాలిటీ హోదా కల్పిస్తామని గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అమలు చేయలేదని ప్రజలు గుర్తుచేశారు. జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని స్థానికులు ప్రశంసించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article