జుక్కల్‌లో సెంట్రల్ లైన్ పనులు వేగవంతం

  జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ పట్టణంలో సెంట్రల్ లైన్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వం ఈ పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ అమలు చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక చొరవతో సెంట్రల్ లైన్ పనులు వేగవంతమయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో రహదారులు,...