26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పోలియో రహిత భారత నిర్మాణంలో పల్స్ పోలియో కీలకం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్

 

జుక్కల్, బతుకమ్మ :

 

పోలియో రహిత భారత నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ అన్నారు. ఆదివారం జుక్కల్ గ్రామపంచాయతీ ఆవరణలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి 0-5 సంవత్సరాల చిన్నారులకు జుక్కల్ సర్పంచ్ పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చిన్నారులు వికలాంగులు కాకుండా పోలియో చుక్కలను వేయాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని పేర్కొన్నారు. ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోనూ ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సేవలు అందిస్తున్నారని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ మాట్లాడుతూ, పోలియోను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు అందడం అత్యంత అవసరమని అన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article