27.8 C
Hyderabad

ఘనంగా పైడి ఎల్లారెడ్డి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నాగిరెడ్డిపేట : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జన్మదిన వేడుకలను శనివారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ దివిటీ రాజ్ దాస్ మాట్లాడుతూ సామాజిక సేవకుడు, ప్రముఖ శాస్త్రవేత్త అయిన పైడి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని  చాలా గ్రామాలతో పాటు, ఇతర నియోజకవర్గ గ్రామాలలో కూడా స్వచ్ఛందంగా త్రాగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందజేస్తున్న గొప్ప అపర భగీరథుడు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బెంచీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన గొప్ప సేవా నిరతి కలిగిన వ్యక్తి పైడి ఎల్లారెడ్డి గారని ఆయన చేసిన సేవలను కొనియాడారు. పైడి ఎల్లారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని, ప్రజలకు సేవలు అందించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మ్యాకల హన్మండ్లు, దేవి సింగ్, గోపాల్ రెడ్డి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Celebrate the birthday of Paidi Ella Reddy

More articles

Latest article