బతుకమ్మ, సాలురా: మండలం లోని ఖాజాపూర్ ప్రభుత్వ పాఠశాలలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు విద్యార్థులు ప్రతిభ చూపిన సైన్స్ ఎక్సిబిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు వివిధ ప్రాజెక్టులు, నమూనాలు ప్రదర్శించి తమ సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభ మాట్లాడుతూ, విద్యార్థులలో విజ్ఞానపరమైన ఆసక్తిని పెంచడంతో పాటు వారి సృజనాత్మకతను సైన్స్ ఎక్జిబిషన్ వృద్ధి చేస్తాయని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కార్యక్రమానికి హాజరై విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ఈ ఎక్సిబిషన్‌లో పర్యావరణ పరిరక్షణ, నూతన శక్తి వనరులు, , రసాయన పరిశోధనలు తదితర విభాగాల్లో విద్యార్థులు ఆకట్టుకునే ప్రదర్శనలు అందించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్, ఉపాధ్యాయులు జ్యోతి, సాయిలు, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.

