నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేస్ 1 లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు మెరుపు దాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సీసీఎస్ సిఐలు సురేష్ , సాయినాథ్ , ఎస్ ఐ గోవింద్ ,సిబ్బంది తో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగస్థాన్ -1 లోని లక్ష్మి నరసింహ అప్పట్మెంట్ నందు పేకాట స్థావరం పై రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న 9గురు పేకాట రాయుళ్ళను అరెస్టు చేసి వారి వద్ధ 9సెల్ ఫోన్, రూ.49,250 స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ అప్పగించారు.
