24.5 C
Hyderabad
Friday, July 31, 2026

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే 

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ పిట్లం :  పిట్లం మండల కేంద్రంలో సి.సి. రోడ్డు నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  భూమి పూజ చేశారు. శుక్రవారం  శాంతినగర్ కాలనీలో పనులను ప్రారంభించారు. సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా పిట్లం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆ మహానీయురాలి చిత్రపటానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  పుష్పాంజలి ఘటించారు. సావిత్రిబాయి పూలే జయంతిని ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నది అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, చిల్లరిగి సొసైటీ చైర్మన్ శబదం రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు హనుమాన్లు, మోహన్ రెడ్డి, ఏ శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి రాములు,మోయిన్, గంగారం మేస్త్రి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article