కుల సంఘం దౌర్జన్యం

0 1,294
  • రాత్రికి రాత్రే ఇంటి ప్రహరి కుల్చివేత
  • పోలీసులకు పిర్యాదు చేస్తే కుల బహిష్కరణ పేరిట బెదిరంపులు
  • రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

 

 నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తాము కొనుగోలు చేసిన భూమిలో ఇళ్లు కట్టుకుంటే తమపై కుల సంఘం దౌర్జన్యంకు పాల్పడిందని.. రాత్రికి రాత్రే ఇంటి ప్రహరీ కుల్చీవేశారని… ప్రశ్నిస్తే కుల బహిష్కరణ చేస్తామని బేదిరించారని భాదితులు వాపోయారు… నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారం ( ఎం) గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నిర్మల శుక్రవారం ఎసిపి కార్యాలయంలో పిర్యాదు చేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు.. నిజామాబాద్ రూరల్ మండలంలోని ధర్మారం (ఎం ) గ్రామానికి చెందిన  ఎర్రోళ్ల నిర్మల సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే కుల సంఘానికి చెందిన కొంతమంది ఈ ఇల్లు ప్రహరీ గోడ మా స్థలంలోకి వచ్చిందని చెప్పడంతో ఎమ్మార్వో ఆధ్వర్యంలో ఇంటి స్థలాన్ని పరిశీలించి ప్రహరీ గోడ కొంత భాగం సంఘానికి సంబంధించిన స్థలంలోకి వచ్చిందని,ఆ భాగాన్ని తొలగించాలని సూచించగా,ఆ విషయాన్ని ఒప్పుకొని అంగీకరించామని తెలిపారు. కానీ సంఘానికి చెందిన కొంతమంది వ్యక్తులు గురువారం అర్ధరాత్రి ఎమ్మార్వో సూచించిన స్థలాన్ని కాకుండా,మా ఇంటి ప్రహరి గోడను కూల్చివేయడం జరిగిందన్నారు. అడ్డు వెళ్లిన మమ్మల్లి మహిళలని కూడా చూడకుండా బూతులు తిడుతూ,నా కుమారుడిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు.  ఈ విషయంలో పోలీస్ అధికారులకు పిర్యాదు చేస్తే కుల బహిష్కరణ చేస్తామని బేదిరంపులకు పాల్పడ్డారని వాపోయారు. ఈ విషయంలో డయల్ 100 కు పిర్యాదు చేసిన శుక్రవారం ఉదయం వచ్చి పరిశీలిస్తామని చెప్పారన్నారు. రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో లీఖిత పూర్వకంగా పిర్యాదు చేసేందుకు వేళ్లగా స్పంధించలేదని. శుక్రవారం ఉదయం రూరల్ ఎస్సై అందుబాటులో పోలీస్ స్టేషన్ లో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.మా ఇంటి చుట్టు రాత్రులు కొంత మంది తిరుగుతూ బెదిరిస్తున్నారని,మాకు,మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని జిల్లా అధికారులు మాకు న్యాయం చేయాలని కోరారు. ఆమె వెంట శారద,లీల ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.