బతుకమ్మ, నాగిరెడ్డిపేట : మండలంలోని వాడి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి, మల్లికార్జున స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం లో భాగంగా ఆలయం నిర్మాణానికి టైల్స్ వితరణ చేయడంతో పాటు, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు పైడి ఎల్లారెడ్డి కి సాంప్రదాయబద్ధంగా గొంగడి కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దివీటి రాజ్ దాస్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
