29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పట్టణ సీఐ తుల శ్రీధర్ హెచ్చరిక

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం బాన్సువాడ పట్టణంలో నెంబర్ ప్లేట్ వాహనాలు, నెంబర్ ప్లేట్ పై స్టిక్కర్లు అతికించిన వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ ఉండాలని లేనియెడల అలాంటి వాహనదారుడు పై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారూ. ప్రతి ఒక్కరు పోలీస్ విధులకు ఆటకం కలిగించిన అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ వాహనదారులు చట్టాన్ని వ్యతిరేకించకూడదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

More articles

Latest article