31.6 C
Hyderabad

ఇందూరులో ‘హనుమాన్ కథ’ వైభవం అద్భుతం..

The grandeur of the 'Hanuman Katha' in Induru is truly remarkable.

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హనుమాన్ కథ వైభవం ప్రవచన రూపంలో అందించడం ఎంతో అద్భుతంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజిలో నిర్వహించిన హనుమాన్ కథ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్, గీత పరివార్ అధ్యక్షులు శ్రీ గోవిందు గిరిజి మహారాజ్ ఇందూరుకు రావడం, హనుమాన్ కథ వినిపించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సాధారణంగా హనుమంతుడి చరిత్ర అందరికీ తెలుసని, కానీ తెలియని విషయాలు ప్రవచన రూపంలో స్వామీజీ అందజేశారన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన రమేష్ కుమార్, సురేష్ కుమార్ డాలియా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి యువత హిందూ దేవుళ్ళ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆధునికత, సాంకేతికతతో పాటు ఆధ్యాత్మిక వైపు కూడా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్, మల్కాయి మహేందర్, నాయకులు పంచారెడ్డి శ్యామ్, పవన్ ముందడ, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

The grandeur of the 'Hanuman Katha' in Induru is truly remarkable.
 

More articles

Latest article