నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అమ్మమ్మ(గందె కళావతి) 100వ జన్మదినోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక శతాబ్దపు జీవన ప్రయాణం అనేది ఎంతో గొప్ప విషయమని, వందేళ్ల జీవితంలో ఎన్నో అనుభవాలు, మధుర జ్ఞాపకాలు, కుటుంబ విలువలు, ప్రేమానురాగాలు ఇమిడి ఉంటాయని పేర్కొన్నారు. అమ్మమ్మ తన జీవిత ప్రయాణంలో కుటుంబ సభ్యులకు అందించిన ప్రేమ, ఆప్యాయతలు, విలువలు,ఆశీర్వాదాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో అమ్మమ్మ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, ఆమె ఆశీర్వాదాలు కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అమ్మమ్మ ఆశీర్వాదం కుటుంబానికి కొండంత అండ అని, ఆమె జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని గణేష్ బిగాల పేర్కొన్నారు.
