27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

విధుల నిర్వహణను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రిమాండ్ కు తరలించిన ఎస్సై జి సందీప్

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెగ్యానాయక్ తండాలో గొడవ జరుగుతున్నట్లు డయల్-100 కి సమాచారం అందడంతో రాత్రి పహారా విధుల్లో ఉన్న పొతుల ప్రతాప్, తిరుపతికి తెల్లవారుజామున 5 గంటలకు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా లకావత్ నరేష్, లకావత్ బంతిలాల్, డేగావత్ పీర్ సింగ్ మద్యం మత్తులో గొడవ పడుతూ అల్లర్లు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా పోలీసులను దూషిస్తూ విధి నిర్వహణకు అడ్డుపడడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్సై జి సందీప్ తెలిపారు. విధుల నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దీనిని ప్రజలందరు గమనించాలని ఎస్సై జి సందీప్ తెలిపారు.

More articles

Latest article