25.3 C
Hyderabad

ఘనంగా హోలీ పండుగ

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండల కేంద్రంలో అలాగే మండల పరిధిలోని గ్రామాల్లో హోలీ పండుగను చిన్ననాటి స్నేహితులతో, తన తోటి మిత్రులతో ఒకరికొకరు రంగులను పోసుకుంటూ ఎంతో సందడిగా కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా తమకు ఇష్టమైన రంగులతో మునిగి తేలారు. హోలీ పండుగ సందర్భంగా కొందరు యువకులతో (బతుకమ్మ) మాట్లాడగా పాత రంగుల హోలీ నీ పారద్రోలి కొత్త రంగుల ప్రపంచంలో ఏర్గట్ల మండల ప్రజలందరూ అలాగే ఏర్గట్ల గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భవిష్యత్తులో ఇలాంటి హోలీ పండుగలను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని అన్నారు. హోలీ పండుగ శుభ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు యువజన సంఘాల సభ్యులు, అలాగే పలు రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా మండల, గ్రామ పరిధిలోని నాయకులు ఎంతో ఆనందోత్సవంతో గ్రామ ప్రజలతో మండల ప్రజలతో హోలీ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.

More articles

Latest article