27.3 C
Hyderabad

ఫేక్ నెంబర్ ప్లేట్ కలిగిన వాహనదారుడిపై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : నిజామాబాద్  జిల్లా వినాయక నగర్ కు చెందిన చెరువుపల్లి రాహుల్ రాజ్ అనే వ్యక్తి తన స్కూటీ యమహా ఫ్యాసినో టిఎస్ 07 హెచ్ డబ్ల్యూ 2458 ను నిజామాబాద్ లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.  కామారెడ్డికి చెందిన ఒక వ్యక్తి స్కూటీని కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోకుండా  నిజామాబాద్ కు చెందిన రాహుల్ రాజ్ కు సంబంధించిన నెంబర్ ప్లేటును ఇతని స్కూటీ కి పెట్టి పోలీసు వారి నుంచి చలానాలు, ఏదైనా నేరం చేసినట్లయితే దొరకకుండా తప్పించుకోవడానికి  నెంబర్ ప్లేట్  ను మార్చి కామారెడ్డి పట్టణంలో తిరుగుతుండగా పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు.  విచారణ అనంతరం తదుపరి వివరాలు  వెల్లడించనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  పోలీసులను తప్పుదోవ పట్టించాలని ఎవరైనా తమ వాహనానికి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ కాకుండా ఇతరుల యొక్క నెంబర్ ప్లేట్లను పెట్టుకుని తిరిగినా లేదా నెంబర్  ప్లేటును  లేకుండా చేసి  వాహనాలు నడిపిన,  నెంబర్ ప్లేటులను  సగం విరగ్గొట్టి వాహనాలు నడిపిన, నెంబర్లు కనిపించకుండా నెంబర్ ప్లేట్ పెట్టుకొని తిరిగిన వారిపై చట్టరీత్యా చర్యలు  తీసుకొనబడునని పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

More articles

Latest article