నందిపేట్, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీబీ కి అప్పగించడాన్ని నిరసిస్తూ నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రమాదానికి గురి అయిన పిల్లర్లను బాగు చేయడానికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో దాని పైన ఎంక్వయిరీ చేసి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ కక్ష ఆలోచనతో అభివృద్ధి చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించడం చేతకాని రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని కూలగొట్టి ఆంధ్రకు బనకచర్ల పోలవరం ప్రాజెక్టుకు సరిపడా నీళ్లను ఇవ్వడానికి లోపాయి కారి ఒప్పందం చేసుకున్నారన్నారు. కాలేశ్వరాన్ని జల సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తారని భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, జిల్లా మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు వెల్మల్ రాజన్న, వైస్ ఎంపీపీ దేవేందర్, ఉపసర్పంచ్ భరత్, గ్రామ శాఖ అధ్యక్షులు భాస్కర్ రాము, భూమేష్, శ్రీనివాస్, సతీష్, పార్టీ నాయకులు ఎర్రటి మోహన్, దారం సురేష్, తాటికాయల సుభాష్, రామారావు, గణేష్, వార్డు మెంబర్ సాయిలు, నాని, పాష, దుబాయ్ శీను, పెద్దన్న, బుక్కసాగర్ ,యూత్ నాయకులు అశోక్, నరేష్, నవీన్, శేఖర్, అజయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

