. . . ఒక లాకర్ లో 1.50 కోట్ల నగదు
హైదరాబాద్, బతుకమ్మ:
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన ల్యాండ్ అండ్ సర్వే మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి బ్యాంకు లాకర్ లో కట్టల కోద్ధి నగదు దొరికింది. శనివారం ఎసిబి అధికారులు శాలిబండ కెనరా బ్యాంక్ లాకర్ లో రూ.150 కోట్ల నగదును గుర్తించారు. ఇటివల పాతబస్తీలోని ఛత్రినాక డి డి సుంకరి నరహరిరావు ఇంట్లో సోదాల సమయంలో రూ.1.54 కోట్లు పడక గది కప్ బోర్డ్ లో లభ్యమైన విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలలో రూ.2.29 కోట్లు, రూ.5.04 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్లు ప్రీజ్ చేశారు. అనాడు రైడింగ్ లో 1.3 కోలల బంగారంతో పాటు సుమారు రూ.13 కోట్ల ఆస్తులు గుర్తించారు వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.180 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నరహరి రావు కు సంబంధించిన మరో రెండు లాకర్ లు తెరవాల్సి ఉందని ఎసిబి అధికారులు తెలిపారు. ల్యాండ్ అండ్ సర్వే రికార్డు విభాగంలో కారుణ్య నియామకం చైన్ మెన్ గా విధులలో చేరిన నరహరి రావు డిప్యూటీ డైరెక్టర్ వరకు అడ్డగోలుగా సంపాదించారని ఏసీబీ తనిఖీలలో వెల్లడైంది. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సర్వే లకు సంబంధించిన నరహరి రావు పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు దొరికిన వాటిలోనే కోట్ల నగదు కట్టలు బయట పడగా మరో రెండు లాకర్ లను తెరిచితే అందులో ఎంత కట్టల పాములు బుసలు కోడుతాయోమోనని చర్చ జరుగుతుంది. నరహరి రావు వద్ద దొరికిన నగదు ఎసిబి చరిత్రలో కొత్త రికార్డు అని చెబుతున్నారు.
