30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బిఎస్ఎన్ఎల్ రూ.299కే అన్లిమిటెడ్ కాల్స్, 4జి డేటా సేవలు

Must read

📰 Generate e-Paper Clip

  • బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన ఏ రాష్ట్రంలో లేకుండా మొట్టమొదటిసారిగా తెలంగాణలో  299 కే ఉచిత ఫోన్ కాల్స్, 4జి డేటా అందుబాటులో ఉంటాయని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల బిఎస్ఎన్ఎల్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా బిఎస్ఎన్ఎల్  25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ  సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు కేకే కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు మట్లాడుతూ ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు నెలలు లోపు బిఎస్ఎన్ఎల్ సంబంధించిన సిగ్నల్ టవర్స్ ను ఏర్పాటు చేసి మారుమూర గ్రామాల ప్రాంతాలకు సైతం, కరెంట్ వ్యవస్థ లేని గ్రామాలలోను కూడా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు అందిస్తున్నామన్నారు. ముందు ముందు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరెన్నో ఫ్యూచర్ ప్లాన్స్ అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జగ్గారం, బిఎస్ఎన్ఎల్ డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.

BSNL offers unlimited calls and 4G data services for Rs. 299

More articles

Latest article