25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు

Must read

📰 Generate e-Paper Clip

 

బతుకమ్మ , బిచ్కుంద :

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామపంచాయతీలో ఎన్నికల అధికారికి జుక్కల్ మాజీ బి ఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు హన్మంత్ షిండే బలపరిచిన చిన్న దేవాడ సర్పంచ్ అభ్యర్థి శంకర్ పటేల్, చిన్న దడిగి సర్పంచ్ అభ్యర్థి అనసూయ సాయి రెడ్డి, పెద్ద దడిగి సర్పంచ్ అభ్యర్థి శిల్పారాణి శ్రావణ్ కుమార్ లు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బిచ్కుంద టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ రావ్ దేశాయ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు కష్టపడే వ్యక్తిత్వం గల అభ్యర్థులను ఎన్నుకొని ప్రజలు తమ ఓటు ద్వారా భారీ మెజారిటీతో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్.రాజు,పెద్ద దడిగి మాజీ సర్పంచ్ సాయిలు,చిన్న దడిగి మాజీ సర్పంచ్ అనిత విట్టల్ రెడ్డి, గణపతి రెడ్డి,హనుమత్ రెడ్డి, కృష్ణారెడ్డి,గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ,జ్ఞానేశ్వర్ రెడ్డి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

BRS Party Sarpanch candidates who filed nominations

 

More articles

Latest article