నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని టీఎన్జీవో కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఫోరం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదును ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్,టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ , జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ లు ప్రారంభించారు. టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదటగా… సదరు శాఖ నందు ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించిన ఫణి కళ్యాణ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, 2 నిమిషాలు మౌనం పాటించి, వారి సేవల ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించి,2025-26 సం.కి గాను టీఎన్జీవో సభ్యత్వాన్ని ఉద్యోగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు వ్యవసాయ శాఖ ఫోరం జిల్లా అధ్యక్షుడు శశీ కాంత్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి, సునీల్ టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ , వ్యవసాయ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.


