అవినీతిలో కురుకుపోయిన బిఆర్ఎస్ నేతలను రప రఫ్పా జైలులో వేయాలి

0 2,911

 

. . . సీఎం రేవంత్ ఉదయం బెదిరించి సాయంత్రం సంచులు తీసుకుంటుంటే పార్టికి పుట్టగతులు ఉండవు

. . . పోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని మొదట కోరింది నేనే

. . . జాతీయ పసుపు బోర్డు కార్యాలయం కేంద్రహోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం

. . . నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్

 నిజామాబాద్ , బతుకమ్మ:

దేశంలోనే అత్యంత అవినీతిలో కురుకుపోయిన బిఆర్ఎస్ పార్టి నాయకులను వీపులో గుప్ప గుప్పా గుద్ధి .. రప్ప రప్ఫా జైలులో వేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ పార్టి జిల్లా కార్యాలయంలో ఎంపి అరవింద్ విలేఖరులతో మాట్లాడుతు… కాళేశ్వరం స్కామ్ లో కేసిఆర్, లిక్కర్ స్కామ్ లో కవిత, ఫోన్ ట్యాపింగ్ కేసు లో కేటీర్, విద్యుత్ స్కామ్ లో హరిష్ రావు లను జైలులో వేయాలన్నారు. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ లో ఎవ్వరు గెలువరని హరిష్ ఒక్కరు గెలిచే అవకాశం ఉందని జ్యోస్యం చేప్పారు. పోన్ ట్యాఫింగ్ కేసు ను విచారణ చేస్తున్న సీట్ పై నమ్మకం లేదని మొట్ట మొదట సిబిఐకి ఇవ్వాలని బిజేపి కేంద్రమంత్రులను ట్విట్టర్ లో కోరింది తానేనని ఎంపి అర్వింద్ అన్నారు. సీఎం రేవంత్ ఉదయం బెదిరించి సాయంత్రం సంచులు తీసుకోని మిలాఖత్ అవుతే కాంగ్రెస్ కు పుట్టగతులుండవు అన్నారు. నిజామాబాద్ జిల్లా కు మంత్రి పదవి రాకపోవడం దూరదృష్టం అన్నారు. జిల్లా లో కాంగ్రెస్ లో లీడర్లను పార్టి గుర్తించలేద అని ప్రశ్నించారు. పార్టి పరంగా  బిజేపి కార్యకర్తగా తనకు కుడా జిల్లా కు మంత్రి పదవి రావద్ధని కోరుకుంటాను అన్నారు.

BRS leaders who are mired in corruption should be thrown in jail.

తెలంగాణలో అత్యధికంగా పసుపు పండించే ప్రాంతంలో పసుపు బోర్డు ఎర్పాటు కల నేరవేరుతుందని ఈ నెల 29న జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహయ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డును ప్రారంబిస్తున్నామని ఎంపి అర్వింద్ అన్నారు. ఈ చారిత్రత్మక ఘట్టానికి పసుపు రైతులు, ప్రజలు పెద్ధ ఎత్తున తరలిరావాలని కోరారు. పాలిటెక్నిక్ మైదానంలో పసుపు రైతులతో జరిగే సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గోంటారని అన్నారు. ఈ నెల 29న దివంగత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సంధర్బంగా కంఠేశ్వర్ బైపాస్ లో డిఎస్ కాంస్య విగ్రహం అవిష్కరణను కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా జరగుతుందని అన్నారు. గుజారాత్ లోని సబర్మాతి నదిఓడ్డున స్ట్యాచ్చు అప్ యూనిటి( సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ) విగ్రహ రూపశిల్పీ పద్మ భూషన్ రాం సుతారే చెతుల మీదుగా 2 టన్నుల డిఎస్ కాంస్య విగ్రహం తయారు చేయించినట్లు తెలిపారు. నిజామాబాద్ నగర నడిబోడ్డున డిఎస్ విగ్రహం ఎర్పాటుకు నిజామాబాద్ బల్ధియా తీర్మాణం, ప్రభుత్వం అనుమతించడం పట్ల అయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యానారయణ, జాతీయ పసుపు బోర్డు అధ్యక్షుడు పల్లే గంగారెడ్డి, జిల్లా పార్టి అధ్యక్షులు దినేష్ కులాచారీ, పార్టి సినియర్ నాయకులు స్రవంతి రెడ్డి, న్యాలం రాజు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.