. . . డబ్బుల కోసం కోడుకు ఘాతుకం
బోధన్ , బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటకుర్దు గ్రామంలో గైక్వాడ్ చంద్రకళ (60) అనే మహిళ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది.సమాచారం అందుకున్న బోధన్ రూరల్ ఎస్‌ఐ మచ్చేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అదివారం రాత్రి చంద్రకళను గోడ్డలితో నరికి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. చంద్రకళ కు ఇద్ధరు కోడుకులు, కుతురు కాగా వారందరికి పెళ్లిళ్లు కాగా వారు మహరాష్ట్రలో జివిస్తుండగా ఆమే ఓంటరిగానే ఉంటున్నట్టు తెలిసింది. చంద్రకళ ను కోడుకే హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీస్ విచారణలో తెలిసిందని బోదన్ రూరల్ సిఐ విజయ్ బాబు తెలిపారు. డబ్బుల కోసము ఈ ఘాతుకానికి ఓడిగట్టినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
