27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మున్సిపల్ కమిషనర్ బదిలీకి బ్రేక్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ బదిలీకి బ్రేక్ పడినట్లు తెలిసింది. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న దిలీప్ ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో డాక్టర్ యాదగిరిరావు నియమిస్తూ బుధవారం రాత్రి సీడీఎంఏ అధికారులు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.  మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బదిలీ రాత్రికి రాత్రి జరిగిన విషయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు సీడీఎంఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న అధికారిని ఎలా చేశారని మండిపడినట్టు తెలిసింది. సీడీ  ఎం ఏ అధికారులు  బోధన్ మున్సిపల్ కమిషనర్ బదిలీ చేయడం లోను  అతి ప్రదర్శించారని వాదనలు లేకపోలేదు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బదిలీ వ్యవహారం 24 గంటల్లో నిలిచిపోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది గడవకముందే బదిలీ చేయడం వెనుక సీడీఎంఏ అధికారుల హస్తం ఉందని సమాచారం.

More articles

Latest article