మున్సిపల్ కమిషనర్ బదిలీకి బ్రేక్
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ బదిలీకి బ్రేక్ పడినట్లు తెలిసింది. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న దిలీప్ ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో డాక్టర్ యాదగిరిరావు నియమిస్తూ బుధవారం రాత్రి సీడీఎంఏ అధికారులు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బదిలీ రాత్రికి రాత్రి జరిగిన విషయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు సీడీఎంఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం...