- నుడా చైర్మన్ కేశ వేణు
- బహుజన కాలనీలో బోనాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బోనాలు అని నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీలో నిర్వహించిన బండ పోచమ్మ బోనాల పండగ వేడుకలకు నుడా చైర్మన్ కేశ వేణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూడ చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ద్వారా ప్రజలు సుఖశాంతులతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుందని అన్నారు. బహుజన కాలనీ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఉంటూ బోనాల ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం అన్నారు. బహుజన కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున కూడా ప్రతిష్టాత్మకంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామర్తి గోపికృష్ణ, వేణురాజ్, పార్థసారథి, రాజేష్, మల్యాల గోవర్ధన్ లను ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ నాయకులు గంగ,జరీనా,రక్ష, మరియు బహుజన కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు మారుతి, అలీ, లక్ష్మి, శాధుల్ ఖాన్ పాల్గొన్నారు.

