27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అంబేద్కర్ ను అవమానించింది బీజేపీ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

  • కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ని అవమానించిన బిజెపి నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని వారి పాపపు చేతులతో తాకినందుకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నుండి గ్రామ స్థాయి బిజెపి కార్యకర్త వరకు అంబేద్కర్ ను అవమానించిన,అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ గురించి అవకులు చెవాక్కులు మాట్లాడితే ప్రధానిగా మోడీ మందలించలేదన్నారు. అంబేద్కర్ పేరు కంటే దేవుడి పేరును తలుచుకుంటే పుణ్యం వస్తుందని అమిత్ షా అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన తీరు దేశం మొత్తం చూసిందని అన్నారు.నిజానికి అంబేద్కర్ సబ్బండ వర్గాల ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చారని,అందుకే దేవుడు లాంటి అంబేద్కర్ పేరును జపం చేస్తారని,ఆయన చేసిన సేవలు,ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ప్రజలు ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ అనిఅమిత షా పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అనిదీనివల్ల బీజేపీ కి అంబేద్కర్ పై చితశుద్ధి లేదని అర్థమవుతుంది అని అన్నారు. హత్యచేసిన వారే సానుభూతి తెలిపినట్టు రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలు శుద్ధి చేశారు అని బిజెపి నాయకులకు అంబేద్కర్ విగ్రహాలను తాకినందుకు,బీజేపీ నాయకుల పాపపు చేతులతో అంబేద్కర్ ను తాకారు.కావున  అంబేద్కర్ కు వారి పాపలు తలకూడదని ఈ రోజు అంబేద్కర్ విగ్రహ శుద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్,నగర కాంగ్రెస్ అధ్యక్షులు,నుడా చైర్మన్ కేశ వేణు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంత రెడ్డి రాజా రెడ్డి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,రాష్ట్ర ఎన్ఎస్ యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు లింగం,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,విజయ్ పాల్ రెడ్డి,సుమన్,వినోద్ బోటి,సంగెం సాయిలు,కేశ మహేష్,సాయి కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article