మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం
హైదరాబాద్, బతుకమ్మ : మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమంలో ప్రభుత్వం నిర్వహించనున్న సరస్వతి పుష్కరాల కోసం రూ.35 కోట్ల నిధులు కేటాయించింది.ప్రతిరోజు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. సరస్వతి పుష్కర్ – 2025 వెబ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ ను ప్రారంభించిన మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ మంగళవారం ఆవిష్కరించారు.
