24 C
Hyderabad
Sunday, August 2, 2026

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలవ బోతుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బిజేపి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ

. . . తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసింది

. . . ప్రజలకు ఏమీ హామీలు ఇచ్చాడో రేవంత్ మరిచిండు

. . . ఎంపీ ధర్మపురి అరవింద్

 నిజామాబాద్, బతుకమ్మ:

ఇటివల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన మైన పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలవబోతుంది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బిజేపికి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని  జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అర్వింద్ మీడియా సమావేశంలో అన్నారు.  ఇటివల జగిత్యాల లో జరిగిన బిఆర్ఎస్ సభకు ఐదారు వేల మంది మించి జనాలు లేరని జీవన్ రెడ్డిని ఎందుకు పార్టీ చేర్చుకున్నారు కెసిఆర్ కె తెలియదు అన్నారు. జగిత్యాల ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కేసీఆర్ శకం ముగిసిందన్నారు.తెలంగాణ ప్రజలని మత్తుకు బానిసలను చేసింది కేసీఆర్ ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో బిఅరెస్, కాంగ్రెస్ కొట్టుకుపోతాయ్ అని జోస్యం చెప్పారు.ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ ఫెయిల్. రేవంత్ పరిపాలన ఫెయిల్. పాలనపై రేవంత్ కు అవగాహన లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ రేవంత్ మర్చిపోయారు అని అరవింద్ అన్నారు. మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ అడ్డుకున్న మహిళలు మోసం చేసిందని గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్ పాపులర్ ఎమ్మెల్యే అన్నారు. ఆయన చుట్టూ ఏమి జరుగుతుందో అతనికి తెలియదన్నారు. జిల్లాలో ‘8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగాలి ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్ టన్నులు కూడా సెకరించలేదని అన్నారు. ఉచిత రేషన్ కేంద్రం ఇస్తుంది. అదే మాదిరిగా ప్రతి ధాన్యం గింజను ఎప్ సి ఐ కోంటుంది అన్నరు. పసుపు రైతులకు అధిక ధరలు రావడానికి కారణం మోడీయే.ధాన్యం కొనుగోల్లాలో జాప్యం జరుగుతుంటే జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. తెలంగాణలో రూ.7800 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కోసం మోదీ రాష్ట్రానికి వస్తున్నారు దానిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

BJP is going to win in West Bengal

ఐదు రాష్ట్రాలలో బీజేపీ గెలుస్తుంది…

సోమవారం వెలువడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపి గెలుస్తుందని మోడీ సభ జిల్లా ప్రభారీ, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.దేశ ప్రజలు మోదీ నాయకత్వంలో భద్రత ఫీల్ అవుతున్నారు.తెలంగాణ లో కమిషన్ ప్రభుత్వం నడుస్తుంది.కాంగ్రెస్ ది అవినీతి పాలన.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోదీ తెలంగాణ పర్యటన..ఈ నెల 10 జరిగే మోడీ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.ఈ విలేఖరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు కుల చారి దినేష్, నాయకులు స్రవంతి రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

More articles

Latest article