- రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ
రుద్రూర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో రేపు జరగనున్న బీసీ రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయకపోవడం దారుణమని రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ అన్నారు. బీసీలను మోసం చేసే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించి బంద్ ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి ఎల్లప్పుడు బీసీల పక్షాన నిలుస్తుందని, దేశవ్యాప్తంగా 28 మంది బీసీలను కేంద్ర మంత్రులుగా నియమించిందన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తమ క్యాబినెట్లో ఎంతమందికీ బీసీ మంత్రులకు పదవులు ఇచ్చారో ఒకసారి ప్రజలు ఆలోచించాలని తెలియజేశారు. బీజేపీ పార్టీ అనేక రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులను, క్యాబినెట్ మంత్రులను బిజెపి పార్టీనే చేసిందని, బిజెపి పార్టీ పైన బురదజల్లే రాజకీయాలు మానుకొని బీసీలకు 42% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపటి బీసీ బందును విజయవంతం చేయడానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని తమ పూర్తి మద్దత్తు బీసీ బంద్ కీ తప్పకుండ ఉంటుందని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది.