భీమ్ గల్, బతుకమ్మ : దుకాణానికి అడ్డంగా ఫ్లెక్సీని పెట్టారని పెట్టిన మూడు రోజుల తర్వాత ఫ్లెక్సీని తొలగించినందుకు దుకాణ యజమానిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలనిడిమాండ్ చేస్తూ గురువారం మండల బీజెపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.రంజాన్ సందర్బంగా కొందరు ముస్లీంలు అనుమతి లేకుండా వ్యాపార దుకాణానికి అడ్డంగా ఫ్లెక్సీ పెట్టడడమే కాకుండా పెట్టిన మూడు రోజుల అనంతరం అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని దుకాణం యజమాని తొలగిస్తే ఆ ఫ్లెక్సీలో ఫోటోలు ఉన్న ముస్లీమ్ వ్యక్తులు దుకాణం యజమానిపై దాడి చేసారని, అట్టి వ్యక్తులపై చర్యలు చేపట్టాలని బీజెపీ నాయకులు డిమాండ్ చేశారు.పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా అరగంట పాటు బైటాయించి దుండగులను శిక్షించాలని, హిందువులపై దాడిని సహించేది లేదని, పోలీసులు వెంటనే స్పందించాలని నినాధలు చేశారు.ఈ సందర్బంగా బీజెపి నాయకులు అరే రవీందర్ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు ప్రశాంతంగా ఉన్న భీమ్ గల్ పట్టణంను మరో బైంసా చేయాలని చూస్తున్నారని అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. హిందువులపై దాడులు చేస్తే సాహించేది లేదని తగిన గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు.అనంతరం సీ. ఐ పొన్నం సత్యనారాయణ, ఎస్సై మహేష్ ధర్నా వద్దకు చేరుకొని బీ జె పీ నాయకులను సముదయించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ధర్నాను విరమించలని వారికి సూచించి ధర్నాను విరమింప జేశారు.భాధితుని ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మహేష్ తెలిపారు. పట్టణంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టవద్దని, పెట్టినట్లు తెలిస్తే కఠిన చర్యలు చెప్పాడుతామని ఎస్సై హెచ్చరించారు. అందుకు మున్సిపల్ అధికారుల సహాయం తీసుకొంటామని ఎస్సై తెలిపారు.
