25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయం

Must read

📰 Generate e-Paper Clip

  • కేంద్ర మంత్రి బండి సంజయ్

 

కామారెడ్డి ,బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలపు ఖాయమని సర్వేలు చెబుతున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కామారెడ్డి లోని లింగాపూర్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓటుకు రూ.10వేలు చొప్పున పంచేందుకు చూస్తోందని ఆరోపించారు. అభ్యర్థులు దొరకక రోడ్డున వెళ్లే వారని కాంగ్రెస్ పట్టుకొచ్చిందని తెలిపారు. ఆయనకు సొంత ఎమ్మెల్యేల నుంచి మద్దతు కరువైందన్నారు. కేసీఆర్ ముఖం చూసి ఎవరూ ఓటేయరని టికెట్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు.

More articles

Latest article