బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కామారెడ్డి ,బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలపు ఖాయమని సర్వేలు చెబుతున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కామారెడ్డి లోని లింగాపూర్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓటుకు రూ.10వేలు చొప్పున పంచేందుకు చూస్తోందని ఆరోపించారు. అభ్యర్థులు దొరకక రోడ్డున వెళ్లే వారని...