24.1 C
Hyderabad
Monday, August 3, 2026

లోకల్ బాడీ ఎమ్మెల్సీ రేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

  • సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షులు మహేష్ అండదండలు ఆయనకేనా..
  • సీఎం నోట చంద్రశేఖర్ పిలుపుతో చర్చ

నిజామాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వ్యవహారం మరో ఉప ఎన్నికకు దారితీస్తుందా అనే చర్చ సాగుతుంది. పార్టీ నుంచి వేటుపడిన వెంటనే కవిత తన శాసన మండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై జోరుగా చర్చ సాగుతోంది.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత రాజీనామా తో కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన టీ.పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి (జీసీఆర్) రేసులో ముందు వరుసలో నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అండదండలతో కామారెడ్డికి చెందిన యువ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికే ఎమ్మెల్సీ టికెట్ దక్కే అవకాశం  కన్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి యాక్టివ్ గా పని చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఇంచార్జిగా పని చేసిన సమయంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి అటాచ్ అయ్యారు. అదే సమయంలో కామారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్ ఫై అవిశ్వాసం పెట్టిన సమయం లో చంద్రశేఖర్ రెడ్డి భార్య గడ్డం ఇండప్రియ చైర్పర్సన్ గా పని చేశారు. 9 నెలల పాటు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా యాక్టివ్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. పార్టీకి చేసిన సేవలకు గాను గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఇటీవల టీ.పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  నియమించారు. రెండేళ్ల వ్యవధిలోనే చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో చేరిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు మేరకు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

  • సీఎం నోట చంద్రశేఖర్ పేరు..

ఇటీవల కామారెడ్డిలో భారీ వర్షాలు కురిసిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు పర్యటించారు. జీ ఆర్ కాలనీలో పర్యటిస్తున్న సమయంలో చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ అనీ మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియను బహిరంగాను పిలువడం చర్చనియాంశంగా మారింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నోట చంద్రశేఖర్ రెడ్డి పేరు పిలువడం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. కామారెడ్డి పర్యటన నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో హెలిప్యాడ్ వద్ద సీనియర్ నేత షబ్బీర్ అలీ వర్గీ్యులను కాదని పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులకు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇవ్వడం చుసిన కాంగ్రెస్ నేతలు జీ సీ ఆర్ ప్రాధాన్యతను చర్చించుకుంటున్నారు. ఇటు పీసీసీ అధిష్టానంకు… అటు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చంద్రశేఖర్ రెడ్డి ఉంటున్నరనేది చర్చ పార్టీ వర్గాల్లో అందరికి తెలిసిందే.

కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఏకచక్రాధిపత్యం ఉన్న తరుణంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో పీసీసీ కార్యవర్గంలో పోస్ట్ రావడంతో షబ్బీర్ అలీ వర్గీయలు జీర్ణించు కోలేకపోయారు. ఒకదశలో కామారెడ్డి కాంగ్రెస్ లో రెండు వర్గాలుగా మారిపోయాయి. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు నిర్వహించిన యాత్రలో కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాల్గొని పార్టీ దృష్టిలో పడ్డారు.

  • ఎమ్మెల్సీ పై జీసీఆర్ కన్ను..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం కానుంది. ఒకవేళ ఎమ్మెల్సీ గా కవిత రాజీనామా యాక్సెప్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఆ స్థానం పై దృష్టి పెట్టింది. మరో రెండేళ్లు పాటు ఎమ్మెల్సీ పదవి కాలం ఉండటం కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు దృష్టి సారించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ పోస్ట్ కోసం నజర్ పెట్టారనే చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ లో యువతకు పెద్ద పిీట వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారంతో జీ సీ ఆర్ పేరు రాష్ట్ర స్థాయిలో చర్చ సాగుతుంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ, తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ల అండదండలతో ఎమ్మెల్సీ ఇస్తారనే టాక్ కామారెడ్డి కాంగ్రెస్ లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం సైతం చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జోరుగా సాగుతుంది.

Gaddam Chandrasekhar Reddy in the race for local body MLC

More articles

Latest article