- బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్.
ఎల్లారెడ్డిపేట బతుకమ్మ : మోదీ కానుకగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు,కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన జన్మదినము కానుకగా కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఎల్లారెడ్డిపేట బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్ తెలిపారు.జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డ బోయిన గోపి చేతుల మీదుగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం వుంటుందని
పాఠశాలలోని పదవతరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,బీజేపీ శ్రేణులు సకాలంలో విచ్చేసి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని దాసరి గణేష్ కోరారు.
