26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్

 

రాజన్న సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ  :బీసీ వర్గాలకు హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్‌ను చట్టబద్ధంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీసీ నేత కంచర్ల రవి గౌడ్ డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా మంగళవారం సిరిసిల్ల లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “కామారెడ్డి బహిరంగ సభలో అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీని విస్మరించి మోసం చేస్తున్నారు” అని విమర్శించారు.బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం ఎల్లప్పుడూ బీసీల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసిందని రవి గౌడ్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీ ఓట్లు పొందడానికే కాంగ్రెస్‌ పార్టీ రిజర్వేషన్ ముసుగులో కొత్త రాజకీయ ప్రయోగాలు చేస్తోందని ఆరోపించారు. “రాష్ట్రపతి ఆమోదం కోసం అని తప్పించుకుంటూ… సీఎం రేవంత్‌ రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు” అని ఎద్దేవా చేశారు.మా వాటా మాకు కావాలి“మేము బీసీలు భిక్షవాళ్లం కాదు… మా వాటా మాకు కావాలి” అని స్పష్టం చేసిన రవి గౌడ్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. “స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల రిజర్వేషన్ అమలయ్యాకే జరగాలి” అని ప్రధానమైన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లూరి సాయి సూర్య, ముద్ద మనీల్ గౌడ్, ఎస్‌.కె. అప్రోచ్, కోడం వెంకటేశం, వడ్లూరికి వేణ, జుమీర్, హరీష్, అమ్ము తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article