సంస్కృతి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

0 14,546

కామారెడ్డి, బతుకమ్మ: సంస్కృతి ప్రవేటు పాఠశాలలో  ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని చాలా ఉత్సాహంగా ఆనందోత్సాహాలతో కోలాహలంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన, అత్యంత ప్రాచుర్యం పొందిన పూల పండుగ బతుకమ్మ. “బతుకమ్మ” అంటే “జీవించే తల్లి” లేదా “జీవనానికి మూలమైన తల్లి”. ఆశ్వయుజ మాస శుక్ల పక్షం ప్రారంభమై దసరా పండుగ ముందు రోజు వరకు 9 రోజుల పాటు జరుపుకుంటారు. స్త్రీలు, ముఖ్యంగా ఆడపిల్లలు, పసుపు రంగు చీరలు ధరించి పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. గడ్డిపూలు, గుంజిపువ్వు, తంగేడు, బంతి, గున్నెపువ్వు మొదలైన రకాల పూలను వాడతారు. పూలను చక్రాకారంలో, పొరలుగా పేర్చి గోపురాకారంలో బతుకమ్మను తయారు చేస్తారు. స్త్రీల ఐక్యత, ఆడపిల్లల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రకృతితో అనుబంధం, పూల పూజ, తల్లి గౌరవం. కుటుంబ సుఖసమృద్ధి కోసం, అన్నదాతలైన రైతుల పంట బాగుండాలని ప్రార్థిస్తూ జరుపుకునే పండుగ అని పాఠశాల యజమాని రాజు, ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Bathukamma celebrations held at Samsukthi School

Leave A Reply

Your email address will not be published.