సంస్కృతి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కామారెడ్డి, బతుకమ్మ: సంస్కృతి ప్రవేటు పాఠశాలలో  ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని చాలా ఉత్సాహంగా ఆనందోత్సాహాలతో కోలాహలంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన, అత్యంత ప్రాచుర్యం పొందిన పూల పండుగ బతుకమ్మ. “బతుకమ్మ” అంటే “జీవించే తల్లి” లేదా “జీవనానికి మూలమైన తల్లి”. ఆశ్వయుజ మాస శుక్ల పక్షం ప్రారంభమై దసరా పండుగ ముందు రోజు వరకు 9 రోజుల పాటు జరుపుకుంటారు. స్త్రీలు, ముఖ్యంగా ఆడపిల్లలు, పసుపు రంగు చీరలు ధరించి పూలతో...